మన న్యూస్ ,కామారెడ్డి జిల్లా ,బాన్సువాడ:
ప్రజల రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జెండా ఊపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు గణనీయంగా పెరిగాయని, రద్దీ సమస్యలు అధికమయ్యాయని తెలిపారు. ఆ రద్దీని తగ్గించేందుకు, ప్రజల అవసరాలను తీర్చేందుకు RTC రెండు కొత్త సర్వీసులను కేటాయించిందని అన్నారు.డిపోకు కేటాయించిన సర్వీసుల్లో ఒకటి నిజామాబాద్–జహీరాబాద్ (వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్), మరొకటి బాన్సువాడ–నారాయణఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) మార్గాల్లో నడవనున్నట్లు వివరించారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ డిపో మేనేజర్ సరితదేవి, పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.