మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ..కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నిఖిల్ , గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని హరిన్, వెంకటరాములు,గుల నారాయణ,దుర్గయ్య,కరోబర్ లింగాల రాములు తదితరులు ఉన్నారు