శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి మాధురి విద్యాలయంలో 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాధురి విద్యాలయ చైర్మెన్ కడారి తమ్మయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు మన దేశ చరిత్రలో ఒక మహత్తరమైన రోజు అని, 1947 ఆగస్టు 15 న మన దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిందని స్వాతంత్య్ర్య ఫలాలను అనుభవిస్తు విద్యార్థులు జీవితంలోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం మాదిరి విద్యాలయంలో "పాఠశాలలో విద్యార్థులలో నిర్వహించిన వస్త్రాలంకరణ ఆకర్షనీయంగా నిలించింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు చైర్మెన్ తమ్యుయ్యనాయుడు, సతీమణి సీతా దేవి చేతులు మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉపన్యాసాలు, దేశభక్తి గేయాల ఆలాపన, తరగతిగదుల అలంకరణ, ఆకట్టుకొన్నాయి. ఈ కార్య క్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది భారీ సంఖ్యల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.