మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సవాయి సింగ్,మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ అమర్ సింగ్,గుణ్కుల్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అనిత, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పల్లె దావఖాన వద్ద డాక్టర్ ఆయేషా లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరమరణాలు పొందిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ప్రతీ పౌరుడు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు తహసీల్దార్ సవాయి సింగ్ నోటు బుక్స్ పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పండరి, యూత్ మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్,నాయకులు ఖాళీక్,తదితరులు ఉన్నారు