మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి, జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ ఈ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేమన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ , స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు ఫలితం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఈ దేశ పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ , వికసిత్ భారత్ వైపు సమాజం అడుగులెయ్యాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి , స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..