మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబు అనే రైతులకు సబ్సిడీపై డ్రోన్ అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే సత్య ప్రభ మండల కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు ఈ డ్రోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.. అందులో భాగంగానే 10 లక్షల రూపాయలు విలువ చేసే వ్యవసాయ పంటలకు మందులు పిచికారి చేసే డ్రోన్ కేవలం రెండు లక్షల రూపాయలకే అందించడం జరుగుతుందని అన్నారు. ఒక్కో డ్రోన్ పై 8 లక్షల రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం రైతులకు ఇస్తుందన్నారు. వ్యవసాయం యాంత్రికరణ చేయాలి తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలి అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు... కార్యక్రమంలో రైతులు,ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు