మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక షిరిడి నగర్ లో యు వి ఆర్ చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్,యు వి ఆర్ ట్రేడింగ్ కంపెనీ,యు వి ఆర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్,బిజెపి కార్యాలయంలో 79వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా బిజెపి పూర్వ ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ 200 సంవత్సరాల పరాయి పాలన నుండి విముక్తి కోసం తొమ్మిది దశాబ్దాలు అమరవీరుల త్యాగాల మేధోమతన ఫలితంగా సామ్రాజ్యవాదం సంకెళ్ల నుండి భారతజాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు స్వతంత్ర దినోత్సవం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేటి అనిల్ కుమార్,దొంతంశెట్టి సుబ్రహ్మణ్యం,ఆర్. సూర్యనారాయణ,సిరిపురపు బాబి,కోరాడు శ్రీను,రోంగల లక్ష్మి,ఈ.మల్లిక,ఉమ్మిడి బుజ్జి,కోరాడ సత్తిబాబు, బత్తిన శ్రీనివాస్,వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.