మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 50 వ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజా అభిమానులు,ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్య ప్రభ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ప్రతిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే సత్యప్రభ గ్లాసులు,భోజనం ప్లేట్లు మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వరుపుల రామకృష్ణ,జువ్విన తిరుపతిరావు దలే నాని,దలే ప్రసాద్,దలే శ్రీను, సూర్నీడి వెంకటేష్,పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.