మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులోని అంజనాద్రి క్షేత్రంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత దఫేదార్ రాజు సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. నిజాంసాగర్ మండల మాజీ సీడీసీ దుర్గారెడ్డి, అంజనాద్రి ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్, సొసైటీ ఛైర్మన్లు నరసింహారెడ్డి, వాజిద్ అలీ, కళ్యాణి విఠల్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
అలాగే ఉమ్మడి నిజాంసాగర్ మండల నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మనోహర్, మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాధుల సత్యనారాయణ తదితరులు హన్మంత్ షిండేను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గంలోని కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి షిండే కు శుభాకాంక్షలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కార్యకర్తలు మనసారా కోరారు.