శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బురదకోట పంచాయతీ పరధి లో ఉన్న గిరిజన తండా బాపన్న దార రామాలయంలో గిరిజన వాసులు పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు చింతల రాజు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గిరిజన ప్రాంతానికి చేసిన సేవలను కొనియాడారు. గిరిజన ప్రాంత వాసులతో ముద్రగడ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ల కాశి బాబు, ముర్ల రాజబాబు, కాకూరి రమణ తదితరులు పాల్గొన్నారు.