దుత్తలూరు,ఆగస్టు13:(మనన్యూస్, ప్రతినిధి):
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు,అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అనంతరం ఆయన మాట్లాడుతూ,బుధవారం నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం నుండి ఉదయగిరిలోని ఏఎంసి మార్కెట్ యాడ్ వరకు రైతన్నలు టాక్టర్లతో వర్షాన్ని సైతం లెక్కచేయక భారీ ర్యాలీ నిర్వహించారుఅనీ ఆయన అన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా 46.5 లక్షల రైతన్నలకు, రూ 2325 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. మన జిల్లా లో అన్నదాత సుఖీభవ మొదటి విడత లో మొత్తం 1,95,866 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5,000/-చొప్పున మొత్తం 97.933 కోట్లు రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందని తెలిపారు. అదే విధంగా పి యం కిసాన్ 20వ విడత కింద జిల్లా వ్యాప్తంగా 1,68,350 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2,000/-చొప్పున 33.67 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం పరిధిలోని ఈస్ట్ వీరయ్యపాలెం గ్రామంలో ఈనెల 1వ తేదీన ప్రారంభించారన్నారు.అలాగే జాతీయ స్థాయి లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో ప్రారంభించారని తెలిపారు. దీనిద్వారా సాగుదారుల కుటుంబాలు అనగా స్వంతంగా సాగు భూమిని కలిగిన రైతు కుటుంబాలు మరియు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములు సాగుచేసే కుటుంబాలకు రూ.20,000/- వార్షికంగా ప్రయోజనం లభించింది అన్నారు.ఇందులో రూ.6,000/- కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా, రూ 14000/- రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఈ విడత లో ప్రతి రైతుకు ఏడి ఎస్ బి కింద 5 వేలు, పీఎం కిసాన్ కింద 2 వేలు కలిపి మొత్తం 7 వేల ఆర్ధిక సహాయం లభిస్తుందని తెలిపారు.
ఒకవేళ ఈ విడత లో అర్హత కల్గిన రైతులు ఆర్ధిక సహాయం పొందనట్లయితే మీ సమీపంలో ఉన్న రైతు సేవకేంద్రము ను సంప్రదించి అవసరం అయిన పత్రాలు సమర్పిస్తే మలివిడత లో మొత్తం పొందవచ్చునని వివరించారు. అలాగే
2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ సుమారు 44 వేల మందికి 30.42 కోట్లులబ్దిచేకూరిందిఅన్నారు.మండలాల వారీగా, ఉదయగిరి 4693 మందికి దుత్తలూరు 4396, వరికుంటపాడు 5387, సీతారాంపురం,2881 వింజమూరు 4705 కలిగిరి7756 కొండాపురం7029 జలదంకి 6622 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులయ్యారన్నారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు.అమ్మ ఒడికి, తల్లికి వందనం పథకానికి పోలిక లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ద్వారా 13 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం అంకెల గారి తప్ప చేసింది ఏమీ లేదు అన్నారు. ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పేరుతో బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబడుతుందన్నారు. ఏడాది కాలంలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాయలసీమను రతనాల సీమను చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.