మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలం గిర్నితండా అంగన్ వాడి కేంద్రాన్ని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ తాజా ఆదేశాల మేరకు,6 నెలల 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు,బాలింతలకు పౌష్టికాహారం సరఫరా అవుతున్న విధానాన్ని ఆమె తెలుసుకున్నారు.
పిల్లలు,తల్లుల్లో పౌష్టికాహార లోపం రాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.అనంతరం గ్రామంలో పిల్లల తల్లుల ఈ-కేవైసీ ఆన్లైన్ ప్రక్రియను పరిచయం చేసి,నమోదు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేవైసీ మండలంలోని 1179 మంది ఉండగా అందులో 950 మందికి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఈ కేవైసీ నమోదు చేయడం జరిగిందని మిగిలిన వారిని పూర్తిగా తిన పూర్తి చేయాలని అంగన్ వాడి టీచర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.