గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ను మొదటగా రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ తెలుగులో వ్రాయబడిన జెండా గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది. అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి. పీర్ కుమార్ ఇటీవల ఈ గేయాన్ని రాశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం మన కళాశాల తరపున విభిన్నంగా జరపడం చాలా ఆనందంగా ఉందని, పీర్ కుమార్ గేయరచన అద్భుతంగా ఉందని, ఇది మూడు రంగుల ప్రాముఖ్యతని, దేశభక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ పింగళి వెంకయ్య మనసులో మెదిలిన పతాకము వాస్తవ రూపం దాల్చిందని ఆయన చేసిన కృషిని, డాక్టర్ పీర్ కుమార్ రాసిన గేయాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ శైలజ, డాక్టర్ గోవిందు సురేంద్ర, భీమవరపు లక్ష్మి, డాక్టర్ కోటేశ్వరరావు, శ్రీధర శర్మ, కిరణ్మయి, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, రవి రాజు, గౌతమ్, శ్రీనివాసులు, సుందరమ్మ, గోపాల్, జనార్దన్, శైలజ, స్వరూప్, శంకర్, శ్రీలత, భాష, వినయ్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.