మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):వర్షాకాలం ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి అరుణ సూచించారు. మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో గ్రామాల పరిస్థితిని పర్యవేక్షిస్తూ,సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వెంటనే స్పందించాలని ఆదేశించారు. అధికారులు ఎటువంటి సెలవులు తీసుకోకుండా, పనులపై పూర్తి దృష్టి పెట్టాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ సవాయి సింగ్.ఎంపీడీవో అనిత,మండల వ్యవసాయ అధికారి నవ్య,మండల వైద్యాధికారి రోహిత్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత, నీటిపారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి అమర్ సింగ్ ,తదితరులు పాల్గొన్నారు.