(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు అన్నారు.గోడే హరీష్ ఆర్థిక సహాయంతో ప్రత్తిపాడులో గోకవరపు వారి వీధికి చెందిన సుమారు 1000 మందికి పైగా రాచపల్లి అడ్డరోడ్డులో భారీ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసికున్నారు.ఈ సందర్భంగా గోడె హరీష్ ని నిర్వాహకులు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అలాగే ఆంధ్రా భద్రాద్రి ఆలయ నిర్మాణానికి గోడే హరీష్ భారీ మొత్తంలో సహాయం చేస్తుండడంతో కమిటీ సభ్యులు కూడా ఘనంగా సన్మానించారు.ఈ వన సమారాధన కార్యక్రమంలో పిల్లలు,పెద్దలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పత్రి రమణ,కందా కామరాజు మాట్లాడుతూ హరీష్ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ కొనసాగడం అభినందనీయమని,యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రా భద్రాద్రి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బంగారు ప్రసాద్,శేరు సత్తిబాబు,వన సమారాధన నిర్వాహకులు పత్రి గౌరీ శంకర్,అప్పికొండ కిషోర్,ఆకుల కుమార్,ఇంధన రాంబాబు,పత్రి భద్రరావు,ఇమ్మంది అయ్యన్న,పెయ్యల శ్రీను,సింగిలిదేవి శ్రీను, అప్పికొండ రామకృష్ణ,గొంతకూరు రాంబాబు,కందా పాపారావు తదితరులు పాల్గొన్నారు.