ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి బెళుగుప్ప ఇంచార్జ్ దగ్గుపాటి సౌభాగ్య, సందిరెడ్డి నారాయణ స్వామి, దగ్గుపాటి శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జెట్టి గోపాల్, మాజీ అధ్యక్షులు వన్నూరుస్వామి, సుంకన్న కోనంకి, ఏరిస్వామి, మనోహర్, రామలింగ సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు, సుధీర్, శేఖర్, తిప్పయ్య, అభిరామ్, రవినాయక్, మండల తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ రాజ్ సెక్రటరీ, శ్రీ విద్యానికేతన్ పాఠశాల, సన్రైజ్ పాఠశాల, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, మండల పురప్రముఖులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. “వారి త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యం” అని నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలు పెంపొందించుకొని, ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని సౌభాగ్య శ్రీరామ్ పిలుపునిచ్చారు.