ఎల్ బి నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని హయత్ నగర్ లోని సాయి శ్రీనివాస బాటిల్స్ కంపెనీలో రేణుక ఎల్లమ్మ తల్లి కి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న టి పి సి సి ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సభ్యులు,ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న , సాయి కిరణ్ కోడలు శార్వారీ ఉప్పల సాయి తేజ బంధువులు , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.