మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత విద్యలో బదిలీలు మరియు అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ గా నామకరణ చేసే విషయంలో జరుగుతున్నా జ్యాప్యంకు నిరసనగా ప్రతి కళాశాలలో శాస్విత ప్రాతిపదికలో పనిచేస్తున్న అధ్యాపకులు, రాష్ట్ర నాయకత్వం (జిసిటిఏ మరియు జిసిజిటిఏ) పిలుపు మేరకు నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ నెల 18న విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమలో కాకినాడ జిసిటిఏ సెక్రెటరీ డా.ప్రయాగ మూర్తి ప్రగడ అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర రావు , శ్రీ కె.సురేష్ పాల్గొన్నారు. అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి.ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కొంత కాలంగా ఉన్నత విద్యలో బదిలీలు మరియు అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ గా నామకరణ చేసే విషయంలో జరుగుతున్నా జ్యాప్యంకు నిరసనగా ప్రతి కళాశాలలో శాస్విత ప్రాతిపదికలో పనిచేస్తున్న అధ్యాపకులు, రాష్ట్ర నాయకత్వం ( జిసిటిఏ మరియు జిసిజిటిఏ ) పిలుపు మేరకు నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమలో కాకినాడ జిసిటిఏ సెక్రెటరీ డా. ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు వేంకటేశ్వరరావు, కె. సురేష్ పాల్గొన్నారు.