మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో టి రాయవరం గ్రామంలో సత్తెమ్మ తల్లికి వైసిపి నాయకులు అభిమానులు పూజలు నిర్వహించారు. గ్రామ ఎంపిటిసి తటవర్తి రామన్న దొర మాట్లాడుతూ నియోజకవర్గానికి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు అభినందనీయమని, ముద్రగడ పద్మనాభం అమ్మవారి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తటవర్తి రామన్న దొర, బత్తుల నాగార్జున, కొండి శ్రీను, మేరా రాఘవ, మొక్కపాటి సత్యనారాయణ, బత్తుల వెంకటేష్, ఎం. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.