మన న్యూస్ సాలూరు ఆగస్టు11:- ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యానికి గురిచేసి వీధిన పడేస్తే డ్రైవర్లు చేసే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్ల సంతకాల సేకరణ వివరాలను సాలూరు డిప్యూటీ తాసిల్దారు కి సంఘం ఆధ్వర్యంలో అందించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం వలన నష్టపోతున్న డ్రైవర్ అందరికీ వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి 25 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు దెబ్బతున్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆటో రంగం దెబ్బతినేలా నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు, పెట్రోల్ డీజిల్ ధరలు అదుపు చేయలేని ప్రభుత్వం, అదే బారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేస్తే వారంతా రోడ్డు మీద పడతారని, దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంభద్రపురం జంక్షన్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ పవన్ కుమార్, వాకాడ హరి, మామిడిపల్లి జంక్షన్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పలరాజు, నర్సింగ్ జ్యోతిష్, సాలూరు సంబర జంక్షన్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సంతోష్ కుమార్, పిన్నింటి కేశవ ,సోమేశ్, సాలూరు మక్కువ జంక్షన్ ఆటో యూనియన్ నాయకులు గొర్ల రమేష్ ,మజ్జి అప్పారావు, సాలూరు పాచిపెంట ఆటో యూనియన్ నాయకులు పి. రమేష్, సాలూరు తోణం ఆటో యూనియన్ నాయకులు మనీ, బోరబంద జంక్షన్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కర్రి తౌడు తదితరులు పాల్గొన్నారు.