గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, డిమాండ్ చేస్తూ టవర్ క్లాక్ సెంటర్ నుండి సి.పి.యం. సి.పి.ఐ వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో సామాన్యలకు భారంగా మారబోతున్న విద్యుత్ స్పాట్ మీటర్లను వ్యతిరేకించండి - విద్యుత్ చార్జీల నిలువు దోపిడిని ఆపాలి - ప్రమాదకర స్పాట్ మీటర్లు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనగా బయలుదేరి ఆర్డిఓ కార్యాలయము ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అదాని స్పాట్ మీటర్లను రద్దు చేయాలని, ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు పెనుబారం గా మారుతాయని, అదానికి కోట్ల రూపాయలు కూడా పెట్టేందుకు స్మార్ట్ మీటర్లను తీసుకుని వచ్చారని విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వం చేపట్టిన స్పాట్ మీటర్ల ప్రక్రియని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని కూటమి నేతలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారన్నారు. నేడు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడంలో కూటమి ప్రభుత్వం ఉందని, అలానే స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు సి.పి.యం. పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్.ప్రభాకర్,టి. వెంకటరామిరెడ్డి,బి.వి రమణయ్య,పుట్టా శంకరయ్య గుర్రం రమణయ్య, ఆర్. శ్రీనివాసులు,అడపాల ప్రసాద్,బి. చంద్రయ్య,ఏంబేటి చంద్రయ్య, గండికోట మధు,వి.భాస్కర్ రెడ్డి, సి.వి.ఆర్.కుమార్,జి.శశి కుమార్ రమేష్,కె.నారాయణ,వై.సునీల్ తదితరులు పాల్గొన్నారు.