మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సూచనలతో మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, ఏఈ నాగశివ, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, ఎ.రవి కుమార్ లతో కలిసి పరిశీలించారు. అతి త్వరలో కోనేరు సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతోపాటు ఆలయం ముందు వర్షపు నీరు ఆగుతుండటంతో శాశ్వత పరిష్కారం దిశగా నేషనల్ హైవే సిబ్బంది తో కలిసి అనుసంధానించి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజప్ప గౌడ, గుర్లపల్లి భీంరెడ్డి, మందుల నరేందర్ , కల్లూరి గోవర్ధన్ , అశోక్ గౌడ్ ఆలయ సిబ్బంది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.