మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ అశోక్ సహకారంతో తొలుత లయన్స్ క్లబ్ భవనంలో కేక్ కట్ చేసి గవర్నర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్ల పంపిణీతోపాటు, ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ అంజన్ ప్రసాద్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, సీనియర్ సభ్యులు బి.కొండయ్య, కర్ని స్వామి, ఎ.రవి కుమార్, అనుగొండ శ్రీనివాసులు, కోళ్ల వెంకటేష్, సుకన్య శేఖర్,డీవీ చారి, అంబాదాస్ రావు, నరేందర్, మఠం వాదిరాజ్, డాక్టర్ మణికంఠ గౌడ్,వాకిటి రమేశ్, డాక్టర్ రాజేష్ గౌడ్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.