అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ….
శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
రైతుల పక్షాన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా అన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెదశంకర్లపూడి వరకూ రైతులు నిర్వహించిన "అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ" లో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పి.ఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతులకు 20వేల రూపాయలు ఇస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు 150 ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ ర్యాలీ లో భాగంగా రాచపల్లి, ఒమ్మంగి, పెదశంకర్లపూడి గ్రామాల వద్ద పొలాలలో రైతులతో ఎమ్మెల్యే కొంతసేపు ముచ్చటించారు. ప్రభుత్వ పనితీరు, కూటమి పాలన గురించి వారిని అడుగగా కూటమి పాలన పట్ల వారంతా సంతోషంగా ఉన్నామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు మేలు చేకూర్చే అన్ని పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ ర్యాలీ రాచపల్లి, ఒమ్మంగి, ఉత్తరకంచి, లంపకలోవ గ్రామాల మీదుగా పెదశంకర్లపూడి చేరుకొన్న ఈ ర్యాలీలో రైతులు, ఎన్డీయే కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.