మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శివకుమార్ ఇటీవల బదిలీపై రాగా, సుల్తాన్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ ఐ ను మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మం, కుర్మ సాయిలు, హుస్సేన్, మహిపాల్ రెడ్డి, బేతయ్య, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వారితో మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అనుమానితులు తిరిగిన పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వారిని కోరారు.