మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్ అన్నారు. శనివారం నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్, అచ్చంపేట రైతు వేదికల్లో నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ, వరిపై రూ.500 బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు అమర్‌ప్రసాద్, నవ్య, కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సవాయిసింగ్, నాగభూషణం గౌడ్ ,ఏఈవోలు స్వర్ణలత, మధు, రేణుక పాల్గొన్నారు. అనంతరం ఏఈఓ మధుసూదన్ పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు.