మన న్యూస్,తిరుపతి, : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఘనంగా నిర్వహించారు. పుష్పవతి యాదవ్ ను ఆమె స్వగృహములో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యదర్శులుసూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి బిజె జే కృష్ణ యాదవ్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ కేక్ ను కట్ చేసి పుష్పావతి యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నగరంలోని 33 వ డివిజన్ పరిధిలోని స్కావెంజర్స్ కాలనీ, 39వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీ, 40 డివిజన్ అన్నారావు సర్కిల్,41 వరదరాజ నగర్ తో పాటు బొమ్మగుంట తదితర ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో ఫోన్లో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.