మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* శ్రీ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునికరిస్తాం..* గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసింది..* త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునికరిస్తాం..* డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తాం..* చక్కటి వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేస్తాం..* ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..రానున్న మూడు నెలల కాలం పరిధిలో 52 డివిజన్లోని పినాకిని పార్క్ ని ..పొట్టే పాలెం వరకు అభివృద్ధి పరిచి 45,46,48,49 డివిజన్ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘాట్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంక్రీట్ వాల్ ఏర్పాటు పురోగతిలో ఉన్నదని. అదేవిధంగా పార్కులో బోట్ షికార్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయడానికి చర్య చేపట్టడం జరిగిందన్నారు. రంగనాయక స్వామి టెంపుల్ లో పూజారులు తెలిపిన విధంగా నీరు నిలబడకుండా ఉండే విధంగా ఐదు లక్షల రూపాయల లోపు పనులున్నాయి సోమవారం నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. పట్టణంలో డ్రైనేజీ మరియు త్రాగునీటి పనులకు 165 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఘాటు పనులను ఆపేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు,ప్రెసెండెంట్ వెంకయ్య యాదవ్,కపిరా రేవతి,కపిరా శ్రీనివాసులు,నారా శ్రీనివాసులు.. టిడిపి ముఖ్య నేతలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.