మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:* నెరవేరబుతోన్న భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల వాంఛ .* పట్టాల పంపిణీ మహోత్సవానికి ఖరారైన ముహూర్తం .* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.* రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నా0.* భగత్ సింగ్ కాలనీ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాం..* 1400 పట్టాలుగాను తొలివిడతలో 650 పట్టాలు అందజేయనున్నాం..* ఎన్నికల హామీ ఇచ్చినట్లు ప్రతీ హామీని నెరవేరుస్తున్నాం..* తల్లికి వందనం కింద 67 లక్షల మందికి పదివేల కోట్లు ఒకేసారి జమ చేసాం..* 15 వ తారీకు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం..* డిసెంబర్ నాటికి టిడ్కో గృహాలు మంజూరు చేస్తాం..రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక 54 డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీలో శనివారం నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పట్టాలు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత 30, 40 సంవత్సరాలుగా భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎటువంటి పట్టాలు లేకుండా జీవిస్తున్నారని అన్నారు. మొత్తం 1400 పట్టాలకు గాను రేపు సుమారుగా 650 పట్టాలను అందజేయనున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన దృపత్రాలపై బ్యాంకు రుణాలు రాక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అంతేకాకుండా చాలామందికి బ్యాంకు లోన్ తీసుకున్నట్లుగా గుర్తించారని వారందరికీ సంబంధించి 144 కోట్ల రూపాయలను జమ చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పట్టాలను త్వరలో అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పింఛన్లను 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు పెంచడం జరిగిందని అదేవిధంగా అంగవైకల్యం కలిగిన వాళ్లకి 6000 రూపాయలు మరియు శాశ్వత చికిత్స పొందుతున్న వారికి రూపాయలు 15 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద 67లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 15 తారీకు నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మెగా డీఎస్సీ నిర్వహించమని అర్హత పొందిన వారికి త్వరలో ఉద్యోగ పత్రాలను అందించనున్నామని ఆయన తెలిపారు. ప్రతి మహిళ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించే విధంగా టిడ్కో గృహాలను మంజూరు చేయనున్నామన్నారు.430 చదరపు అడుగులు ఆ 365 చదరపు అడుగుల గృహాలను డిసెంబర్ నాటికి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం భగత్ సింగ్ కాలనీ వద్ద పలు ప్రాంతాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, కమిషనర్ నందన్, రెవిన్యూ డివిజనల్ అధికారి అనూష.. టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి , నగర అధ్యక్షుడు మామిడాల మధు ,53,54 డివిజన్ క్లస్టర్ ఇంఛార్జి జహీర్, నెల్లూరు నగర కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు జమీర్, 54 వ డివిజన్ అధ్యక్షులు షాహిద్, యూనిట్ ఇంఛార్జి ఖాదర్ భాష, యువత అధ్యక్షులు ముస్తాక్.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.