మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ............ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. కూటమి ప్రభుత్వ విధానాలతో పూర్తిగా లా అండ్ ఆర్డర్ బ్రష్టు పట్టాయి అని అన్నారు.సామాన్యుడు బయట తిరగాలంటే.. వారు టిడిపికి ఓటు వేసిన వారై.. ఉండాలి అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఈమధ్య ప్రభుత్వం రుణాలు కేటాయిస్తున్న పరిస్థితి అందరం చూస్తున్నాం అని అన్నారు.జాఫర్ సాహెబ్ కెనాల్.. స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులో కూడా టిడిపి కార్యకర్తలకే.. షాపులు కేటాయిస్తు.. తెలుగుదేశం పార్టీ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందన్నారు.చివరికి కాంట్రాక్ట్ పనులు కూడా టిడిపి నేతలు చెప్పిన వారికే కట్టబెడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అని అన్నారు.వి ఆర్ మునిసిపల్ స్కూల్లో.. తెలుగుదేశం పార్టీ.. నేతల పిల్లలకే సీట్లుతెలుగుదేశం పార్టీ నేతలు.. సిఫారసు చేసిన వారికే.. వి ఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయిస్తూ.. మంత్రి నారాయణ ప్రజల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఒక పార్టీ కార్యకర్తల పిల్లలకు మాత్రమే..ఒక ప్రభుత్వ పాఠశాలలో.. సీట్లు కేటాయించడమనేది.. బహుశ్య దేశ చరిత్రలో ఎన్నడు జరగలేదు అని అన్నారు.ఇలా మొత్తం 1063 మంది.. టిడిపి కార్యకర్తల పిల్లలకు విఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్లు కేటాయించడం జరిగిందన్నారు.వాస్తవ పరిస్థితులు గమనించినట్లయితే.. వి ఆర్ సి మునిసిపల్ స్కూల్ పరిధికి సంబంధించిన ఏరియాలో నివాసం ఉంటున్న పిల్లలకు మాత్రమే సీట్లు కేటాయించాలన్న విషయం.. ప్రభుత్వ నిబంధనల్లో ఉన్నదన్నారు అని అన్నారు.ఈరోజు మంత్రి నారాయణ నిబంధనలను ఉల్లంఘించి.. వీఆర్సీలో.. తమ కార్యకర్తల పిల్లలకు మాత్రమే సీట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు అని అన్నారు. ఇలా టిడిపి కార్యకర్తల పిల్లలకు మాత్రమే సీట్లు కేటాయించి అక్కడ స్థానికులు అడ్మిషన్ల కోసం వస్తే నో అడ్మిషన్ బోర్డు పెట్టి.. వెనక్కి పంపారని అన్నారు. సచివాలయాలు, పోలింగ్ బూతుల వారీగా, డేటా తెప్పించుకుని.. 264 మంది టిడిపి నేతలు సిఫారసు చేసిన వారికే మంత్రి నారాయణ వి ఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయించడం జరిగిందన్నారు.భారతదేశంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో పార్టీ.. పరంగా మాత్రమే అడ్మిషన్లు కేటాయించే పరిస్థితి ఎక్కడ లేదన్నారు.ప్రత్యక్షంగా ఒక పేద విద్యార్థికి సీటు కేటాయించమని.. టీచర్స్ ఎమ్మెల్సీగా నేను.. సిఫారసు చేస్తే.. నారాయణ టీం తో మాట్లాడుకోవాలని ప్రిన్సిపల్ చెప్పడం సోచనీయమన్నారు.ఇలా మంత్రి నారాయణ వి ఆర్ మున్సిపల్ స్కూల్లో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించారా అంటే... అది కూడా లేదు అన్ని తెలిపారు.కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న కొంతమంది పిల్లలు.. శ్రీ చైతన్య స్కూల్ నుంచి 32 మంది, రత్నం స్కూల్ నుంచి 28 మంది.. నారాయణ స్కూల్ నుంచి 26 మంది.. ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్న 669 మందికి విఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్లు కేటాయించారని అన్నారు.ఇక్కడ పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో.. మంత్రి నారాయణ.. చెప్పాలన్నారు. అలాగే నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 418 మంది విద్యార్థులను.. తీసుకొచ్చి వారికి అడ్మిషన్లు ఇచ్చారని అన్నారు.నెల్లూరు చుట్టూ ఉన్న ప్రభుత్వ స్కూళ్ళ ను.. నిర్వీర్యం చేసే దిశగా మంత్రి నారాయణ ఇలాంటి పోకడలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు . ఒకవేళ విఆర్ మున్సిపల్ స్కూల్లో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించదల్చుకుంటే.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు.. సీట్లు కేటాయించి ఉంటే అందరం సంతోషించే వాళ్ళమని అన్నారు.గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమాన్ని రూపొందించి..ప్రభుత్వ పాఠశాలల ను.. అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఒక ప్రభుత్వ స్కూల్ ను అభివృద్ధి చేయడం అంటే.. పెయింటింగులు వేయడం, గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం కాదన్నారు. పిల్లలకు స్కూల్స్ లో క్వాలిటీ టీచింగ్ ను.. అందుబాటులోకి తీసుకురావడమే నిజమైన అభివృద్ధి అన్నారు. వి ఆర్ సి స్కూల్లో 80 మంది స్టాఫ్ అవసరం ఉంటే.. డీఎస్సీ నోటిఫికేషన్ లో.. ఒక్క వేకెంట్ కూడా చూపించుకో లేదన్నారు. నెల్లూరు నగరంలో మొత్తంగా 22 హై స్కూల్స్..53 ప్రైమరీ స్కూల్స్..ఉంటే.. ప్రైమరీ స్కూల్స్ లో 93 మంది టీచర్లు.. హైస్కూల్లో 102 మంది టీచర్ల కొరత ఉందన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 117 కూడా రద్దుచేసి.. విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు.వీఆర్ మునిసిపల్ స్కూల్లో 15 కోట్ల రూపాయలు.. CSR పండుతో అభివృద్ధి చేశామని చెబుతున్న నారాయణ.. గత వైసిపి ప్రభుత్వం లో విద్యార్థుల కోసం... తీసుకొచ్చిన వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో.. RO సిస్టం, కొళాయిలు మరమ్మత్తులకు నోచుకోక విద్యార్థులకు.. సరిగ్గా మంచినీరు అందని పరిస్థితి నెలకొందన్నారు.1500 రూపాయలు వెచ్చించినట్లయితే.. స్కూళ్లలో ఆర్వో సిస్టం మెరుగుపడుతుందన్న విషయాన్ని మంత్రి నారాయణ మరిచారని ఎద్దేవా చేశారు. వి ఆర్ మున్సిపల్ స్కూల్లో 80 మంది టీచర్లు కావలసి ఉండగా..6 మందిని డిప్యూటేషన్ మీద.. 5 మంది క్లస్టర్ ఇన్చార్జిలను..26 మంది SGT సిబ్బందిని సచివాలయాల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఏ ప్రాతిపదికన సచివాలయాలనుంచి.. సిబ్బందిని.. నియమించుకున్నారో.. తెలియజేయలేదన్నారు. వారిని భవిష్యత్తులో టీచర్లుగా కొనసాగిస్తారా.. లేక ఈ అకాడమిక్ ఇయర్ వరకే.. వారు కొనసాగుతారా అన్న.. స్పష్టత కోరబడిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి నారాయణ మున్సిపల్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి.. అందులో 18 మంది నారాయణ స్టాఫ్ ను..వినియోగించారు. ఆయన ఓడిపోగానే ఆ స్టాఫ్ ని వెనక్కి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 45,975 స్కూల్లో నాడు నేడు.. పనులు చేపట్టి.. పాఠశాలల్లో.. అదనపు తరగతి గదుల నిర్మాణం, IFP ప్యానల్ బోర్డ్స్, RO మంచినీటి సిస్టం, విద్యార్థుల కోసం ట్యాబ్స్.. PAL ల్యాబ్స్, డ్యూయల్ డెస్క్ లు, కలర్ ఫుల్ పెయింటింగ్స్ తో.. అన్ని వసతులు సమకూర్చామని తెలిపారు. అయితే ఇప్పుడు మంత్రి నారాయణ చేస్తున్నది.. స్కూళ్ళ అభివృద్ధి కాదని.. విధ్వంసమేనన్నారు.గత వైసిపి ప్రభుత్వం లో BVS మున్సిపల్ స్కూల్లో.. అద్భుతమైన షటిల్ కోర్టు.. విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు వి ఆర్ మున్సిపల్ స్కూల్లో.. విద్యార్థులకు పెడుతున్న మిడ్ డే మిల్స్.. దారుణంగా ఉందన్నారు.వి ఆర్ మున్సిపల్ స్కూల్ కు యుడైస్ కోడ్ కేటాయించకపోవడంతో.. ప్రభుత్వం అందిస్తున్న మెనూ అమలు కావడం లేదన్నారు.ఇలా మంత్రి నారాయణ వి ఆర్ మున్సిపల్ స్కూల్ విషయంలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.విఆర్సి మున్సిపల్ స్కూల్ కు.. పర్మిషన్లు ఏ విధంగా కేటాయించారు అన్న విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కు లెటర్ రాస్తే.. దాన్ని మున్సిపల్ కమిషనర్ రాజకీయం చేసి.. పొలిటికల్ లీడర్ చేత ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టిస్తున్నారని అన్నారు.వి ఆర్ మున్సిపల్ స్కూల్ విషయంలో కమిషనర్ కు లెటర్ రాయడం నేను చేసిన తప్ప.. టీచర్స్ ఎమ్మెల్సీగా.. వాటి గురించి తెలుసుకునే హక్కు నాకు లేదా.. ప్రభుత్వం చెప్పాలన్నారు.జాయింట్ కలెక్టర్ ఆధీనంలో ఉన్న విఆర్ స్కూల్ ను .. ఆగ మేఘాల మీద కలెక్టర్ గారు.. మున్సిపల్ శాఖ కు బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు ఇవ్వడం సోచినీయమన్నారు. వి ఆర్ సిని.. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా.. జాయింట్ కలెక్టర్.. తన పరిధికి మించి 1000 కోట్ల రూపాయల ఆస్తులను.. మునిసిపల్ శాఖకు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. వి ఆర్ సి స్కూల్ మున్సిపల్ పరిధి లోకి రాకముందే .....ఏప్రిల్ 20 తేదీన.. స్కూల్ కు సంబంధించిన.. డోర్లు, కిటికీల.. కలపను వేలం వేయడానికి అనుమతి తీసుకున్నారు అన్నారు . 15 కోట్ల.. CSR ఫండ్ తో.. వి ఆర్ మున్సిపల్ స్కూల్ ను.. అభివృద్ధి చేశామని చెప్పిన మంత్రి నారాయణ.. పిల్లల రవాణాకు.. సంబంధించి బస్సులు కొనుగోలు కోసం మున్సిపల్ శాఖ నుంచి ఐదు కోట్లు.. విడుదలకి అనుమతులు చేయించుకున్నారని..అలాగే స్నాక్స్ కోసం మరో ఐదు కోట్లు.. మంజూరు చేయించుకున్నారని.. అన్నారు. ఈరోజు విఆర్ మున్సిపల్ పాఠశాలకు సొంత బస్సులు కొనుగోలు చేయకుండానే.. నారాయణ స్కూల్ బస్సులను.. అద్దె ప్రాతిపదికన బస్సుకు నెలకు 1,20,000 చెల్లించేలాగా ప్రజల సొమ్మును స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారని అన్నారు. విఆర్ స్కూల్ పై టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017 లో.. కోర్టుకు వెళితే.. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని.. కోర్టు ఆదేశించిందని తెలిపారు.వి ఆర్ సి కమిటీ ఎన్నికలు జరిగేంతవరకు.. జాయింట్ కలెక్టర్.. ప్రత్యేక అధికారిగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు అన్నారు .ప్రత్యేక అధికారిగా.. వి ఆర్ సి .. విద్యా సంస్థల సంరక్షణను పరిరక్షించాల్సిన.. జాయింట్ కలెక్టర్.. ఇలా విఆర్సి ఆస్తులను మున్సిపల్ శాఖకు.. దారాదత్తం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.వి.ఆర్ మున్సిపల్ స్కూల్లో.. స్టాఫ్ అవసరం అనుకున్న మంత్రి నారాయణ గతంలో ఎయిడెడ్ కింద వెనక్కి వెళ్లిన స్టాఫ్ ను తిరిగి తెప్పించుకొని.. విఆర్సి స్కూల్ ను ఎయిడెడ్ లో కొనసాగించుకోవచ్చు కదా అన్నారు.వి ఆర్ మున్సిపల్ స్కూల్.. అనుమతులు కోసం.. రిక్వెస్ట్ పెట్టుకున్న.. మంత్రి నారాయణ వెంకటగిరి రాజా మున్సిపల్ స్కూల్ అని కాకుండా కేవలం వి ఆర్ మునిసిపల్ స్కూల్ అని పేర్కొనడం అత్యంత హేయమైన చర్య అన్నారు.వెంకటగిరి రాజావారు.. కట్టించి.. ప్రభుత్వానికి దానమిచ్చిన... విఆర్ స్కూల్ చరిత్రను.. కనుమరుగయ్యేలా చేయడమేనన్నారు.వి ఆర్ మున్సిపల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు.. నారాయణ విద్యాసంస్థల నుంచి నోటు పుస్తకాలు.. IIT మెటీరియల్స్ అందజేస్తున్నామని చెబుతున్న.. మంత్రి నారాయణ.. ఇది పబ్లిసిటీ కోసమే చేస్తున్నారన్నారు.నారాయణ అందజేస్తున్న మెటీరియల్స్ కానీ, నోటు పుస్తకాల్లో గానీ.. అందులో నారాయణ అడ్వర్టైజ్మెంట్ లు, వేసుకొని.. పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. వి ఆర్ సి కి సిఎస్ఆర్ ఫండ్ కింద 15 కోట్ల రూపాయలు ఇచ్చిన వారి పేరు కూడా ఎక్కడా లేదన్నారు..మంత్రి నారాయణ పిల్లలకు అందిస్తున్న పుస్తకాల్లో వారి విద్యాసంస్థల పేర్లు వివరాలు వేసుకోవడం సరికాదన్నారుమంత్రి నారాయణ అందిస్తున్న పుస్తకాలపై.. వెంకటగిరి రాజా వారి చరిత్ర.. వారి బొమ్మలు ముద్రించి ఇస్తే పిల్లలకు.. తాము చదువుతున్న విద్యాసంస్థల గొప్పతనం గురించి తెలుస్తుందన్నారు.మంత్రి నారాయణ అందిస్తున్న ఐఐటీ మెటీరియల్స్ ను.. బోధించేందుకు.. వి ఆర్ మునిసిపల్ స్కూల్లో.. తగిన టీచింగ్ సిబ్బంది ఉన్నారా.. మంత్రి నారాయణ చెప్పాలన్నారు.2017 లో మంత్రి నారాయణ.. ఏర్పాటుచేసిన విఆర్ మున్సిపల్.. జూనియర్ కళాశాల కూడా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా.. ఏర్పాటు చేసిందన్నారు.అందుకు అనుగుణంగా నెల్లూరు జండా వీధిలో ఏర్పాటుచేసిన PNM బాలికల మున్సిపల్ జూనియర్ కళాశాలకు.. అసలు అనుమతులే లేవన్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా మున్సిపల్ జూనియర్ కళాశాలల్లో.. టీచింగ్ సిబ్బంది కొరత ఉంటే ఆప్కాస్ ద్వారా అధ్యాపకులను నియమించడం జరిగిందన్నారు.మంత్రి నారాయణ.. మంచి చేస్తే వైఎస్ఆర్సిపి అభినందిస్తుందని.. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా.. ఇష్ట ప్రకారం చేస్తామంటే.. చెల్లదన్నారు.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను..టి డి పి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేసిందన్నారు.నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం.. నిరంతరం పోరాటం చేస్తానని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.