వెదురుకుప్పం, మన న్యూస్ : చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) గా వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరు హుమేష్ ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ నియామక పత్రాన్ని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ రమేష్ బాబు సమక్షంలో అందించారు.కార్వేటినగరం మండలం అన్నూరు లో గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు హుమేష్ మాట్లాడుతూ తనను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ గా నియమించిన షర్మిలారెడ్డి కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.తనకు ఈ పదవి రావడానికి సహకరించిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ కి, జీడి నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ రమేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు మరింత బాధ్యత పెరిగిందని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ రాంభూపాల్ రెడ్డి,ఏపీ సి సి మాజీ కార్యదర్శి ఏపీ పరదేశి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.