మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు విద్యార్థినులు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి జట్టులోకి ఎంపికయ్యారు.
ఎంపికైన విద్యార్థినులు:
• డి. సుశాన్ గ్లోరీ
• సిహెచ్. పల్లవి
• పి. సుప్రియ
• ఎం. నిహారిక
(అందరూ 9వ తరగతి)
ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే. మహాలక్ష్మి గారు విద్యార్థినులను అభినందించారు. విద్యార్థుల విజయానికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీమతి ఎ. కోటేశ్వరమ్మ మరియు శ్రీమతి ఎల్. లావణ్య గార్ల సేవలను కూడా సత్కరించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు ఉత్తేజాన్ని అందించారు