శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- శంఖవరం మండలం సిద్ది వారి పాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి, ఆలయ అర్చకులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు సేవలు అందించాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుండు నాగదేవి చెంచుబాబు, ఈగల విజయదుర్గ, రామిశెట్టి ఏసుబాబు, ప్రత్తిపాడు మండల వైసీపీ కన్వీనర్ రామిశెట్టి నాని,ఈగల మాణిక్యం, ఈగల గంగ, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.