
మన న్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు రూరల్ లో అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒడిస్సా రాష్ట్రం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన కొర్రా డానియల్, దివాకర్, రాంబాబు, కిరణ్ లు ఆంధ్రకు బుధవారం ఉదయం ఏపీ 39 యుజె 2644 గల ఆటోలో ప్రత్యేకంగా తయారుచేసిన సీటు క్రింద 133 కేజీల గంజాయిని బద్రంగా తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు మాతమూరు హైవే రోడ్లో ఆటోని ఆపి వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పి అంకితా సురాని మాట్లాడుతూ, ఒడిస్సా నుండి విజయనగరంకు ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని పాచిపెంట పోలీసులు పట్టుకున్నారన్నారు. పట్టుకున్న గంజాయి విలువ 13.20 లక్షలు కాగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న ఆటోని సీజ్ చేసి నలుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, సురేష్ లు పాల్గొన్నారు.
