
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 6:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సాంప్రదాయ వరి నాట్లు కంటే వరుసలలో కుదురుకి ఒకటి లేదా రెండు మొనలు చివరలు తుంచి నాటుకుంటే ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుందని చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారి కె తిరుపతిరావు అన్నారు. బుధవారం నాడు మండలం చెరుకుపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులు యడ్ల సత్యం, పైల అప్పలనాయుడు వేయిస్తున్న బెంగాల్ వరి నాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వరి నాట్లను వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండా నారు తీయడానికి మోయడానికి పాయలు తీయడానికి కలిపి ఎకరానికి కేవలం 4500 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని సాంప్రదాయ వరి నాటే విధానంలో ఖర్చు 7500 రూపాయలు అవుతుందనితెలిపారు. అంతేకాకుండా వరి నాట్లు వరుసలలో పడడమే కాకుండా తేలికపాటి నాట్లు పడుతున్నాయని ఒకటి లేదా రెండు మొనలను మాత్రమే నాటుతున్నారని దీనివలన దుబ్బు బాగా చేసి దిగుబడి పెరుగుతుందని పాయలు తీసి ఉంచడం వలన అంతర కృషి ఎరువులు చల్లడం వంటివి సులభ తరం అవుతున్నాయని విత్తనం ఎకరానికి 15 కిలోల నారు సరిపోతుందని విత్తనం ఖర్చు కూడా తగ్గుతుందని రైతులు తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చిరొట్ట లేదా నవధాన్యాలను కలియదున్నిన అనంతరం దమ్ము కి పంట దమ్ము కి మధ్య పది రోజులు వ్యాధి ఉంచి వరి నాట్లు వేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచడం ద్వారా రైతులు వేసే రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని ఎరువులకు పంట ప్రతిస్పందన కూడా పెరుగుతుందని తెలిపారు. దమ్ములో బస్తాల ఎరువులు వేసుకున్న అనంతరం 20 రోజుల తర్వాత నానో ఎరువులను ఏదైనా పురుగు మందు తో కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా ఖర్చును మరింతగా తగ్గించుకోవచ్చని సూచించారు.అనంతరం పచ్చిరొట్ట పంటలు మరియు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు లావణ్య ఏ ఈ ఓ నాగమణి పాల్గొన్నారు.
