గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలయ్య గుంట వద్ద కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కు చెందిన భూమిలో కొంతమంది ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నేడు దేవాదాయ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టారు. గూడూరుజ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కు చెందిన భూమి రెండో పట్టణ పరిధిలోని పోలయ్య గుంట వద్ద ఉన్నది ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారు తిరుపతి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి,గూడూరు ఎండోమెంట్ ఆఫీసర్ రవి కృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు ను చేపట్టారు ఏసీ మాట్లాడుతూ దేవాలయ భూమికి చెందిన ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆక్రమణదారులందరూ దేవాలయ భూమిని ఖాళీ చేయాలని సూచించారు ఆక్రమణల తొలగింపులో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.