ఎల్ బి నగర్. మన న్యూస్ :- కొత్త రేషన్ కార్డులను ఎన్నిసార్లు పంపిణీ చేస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.బాలాపూర్ మండలంలో గత నెల 28న ఎమ్మెల్యే సబితారెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా, తాజాగా మంగళ వారం మరోసారి మల్లాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు కార్డులు పంపిణీ చేయడంలో ఆంతర్య మేమిటని ఆయన నిలదీశారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలను తమ స్వార్థ రాజ కీయం కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలనే కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తోందని బీసీ సామాజిక వర్గానికి కాంగ్రేస్ ప్రభుత్వం 42 % శాతం పేరుతో 10% ముస్లింలకు రిజర్వషన్లు కల్పిస్తూన్న కాంగ్రెస్ పార్టీకి. స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కోలన్ శంకర్ రెడ్డి
అన్నారు