ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
గండిపాలెం హరిజనవాడ నందు గల అంగనవాడి స్కూల్ నందు గర్భవతులకు శ్రీమంతం, బాలింతలకు తల్లిపాలు వారోత్సవం అంగన్వాడి టీచర్ నల్లిపోగు సౌజన్య ఆధ్వర్యంలో జరిగినది ఇందులో భాగంగా సూపర్వైజర్ అనిత అంగనవాడి లీడర్ చాంద్ బేగం స్టాఫ్ నర్స్ శైలజ రాణి MLHP మెర్సీ గార్లు గండిపాలెం సర్పంచ్ జి కల్పన ఉపసర్పంచ్ భారతి ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్నారు గండిపాలెం గ్రామ దత్తత మండల ఉపాధ్యక్షుడు గుండుపల్లి మాలకొండయ్య గారు 15 వేలకు పైగా ఆర్థిక సహాయం అందజేశారు మరియు ఎక్స్ ఎంపీటీసీ పాముల రామణయ్య గారు సహయా సహాకారంముతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో 12 మంది గర్భవతులకు బాలింతలకు చీరలు జాకెట్లు పంచారు అలాగే వచ్చినటువంటి అతిథులకు జాకెట్లు పంచారు తదుపరి 50 మందికి పైగా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గండిపాలెం అంగనవాడి వర్కర్ మహాలక్ష్మి, మమత, నాగరత్నమ్మ, ఆయా శోభ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గండిపాలెం మాలకొండ ట్రస్టు సభ్యులు బి వెంకటేశ్వర్లు పాముల రాజా గొల్లపల్లి షారోన్ సుమన్ పాల్గొన్నారు