శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో పాండవుల పాలెం పంచాయితీ పరిధిలో ఉన్న పొదురుపాక గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి, ఆంజనేయస్వామికి గిరిజన మహిళలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గిరిజన మహిళలు భగవంతుణ్ణి ప్రార్థించారు. వైసిపి మండల కన్వీనర్ రామిశెట్టి నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ముద్రగడ పద్మనాభం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొట్టిపల్లి చిన్నోడు, బొడ్డు చిన్నా, కత్తిరి నాగయమ్మ, సోమల భూలక్ష్మి, మరవాడ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.