మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వహించడం తగదన్నారు. జాప్యం చేయడంవల్ల విలేకరులు ప్రభుత్వ రాయితీలను పొందలేకపోతున్నారన్నారు. 2019 నాటికి 23 వేలు మందికి అక్రిడేషన్లు ఉండగా, 2019, 24 మధ్యలో ఉన్న ప్రభుత్వం అక్రిడేషన్ల జారీ చేయడంలో అడ్డగోలుగా వ్యవహరించడం వల్ల 9 వేలు మందికి మాత్రమే అక్రిడేషన్లు వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వమైనా కొత్త అక్కడేషన్లు జారీ విషయంలో జాప్యం వహించకుండా త్వరితగతిన అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సాలూరు సభ్యులు పాల్గొన్నారు.