మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో కలిసి అందజేశారు. వారి డిమాండ్లు ఎలా ఉన్నాయి. పాత ఎక్రిడేషన్ గడువు పొడిగించకుండా వెంటనే కొత్త అక్రిడేషన్ల మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ప్రమాద బీమాని వెంటనే అమలు చేయాలన్నారు. మిగతా రాష్ట్రల మాదిరిగా విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన వారిలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సి హెచ్ వెంకటరమణ, జిల్లా జాయింట్ సెక్రెటరీ పి ఉమామహేశ్వరరావు,జి వి రాజు, సభ్యులు పి వెంకటరమణ, జార్జ్, లావేటి ఈశ్వరరావు,యడ్ల పండు, తదితరులు పాల్గొన్నారు.