జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల విజ్ఞప్తి
గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ :- ఈ నెల 11న ఇంటర్మీడియట్ బోర్డు కమీషనరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్స్ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 475అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఎలక్షన్ కోడ్ కారణంగా చిట్ట చివరి దశలో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ తక్షణమే పూర్తి చేసి ఉత్తర్వులు అందజేయాలని,రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు లెక్చరర్ పదవీవిరమణ వయసు 62 కి పెంచాలని,2024 సంవత్సరానికి సంబంధిoచిన మే నెల వేతనం వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 11 ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర మహాధర్నా కార్యక్రమం నిర్వహించామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటిగా సంతోషం వ్యక్తం చేసింది కాంట్రాక్టు లెక్చరర్స్ మాత్రమేనని గుర్తు చేశారు.గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నమ్మించి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు తాత్సారం చేసి కాంట్రాక్టు లెక్చరర్స్ గొంతు కోసిందని వాపోయారు.ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ వెంటనే పునః ప్రారంభిస్తారని ఎంతో ఆశిoచామని కానీ సంవత్సరకాలం మంత్రులు చుట్టూ,అధికారులు చుట్టూ,తిరుగుతూనే ఉన్నామని అయినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక ప్రభుత్వం దృష్టికి మా సమస్యల్ని తీసుకెళ్లడం కోసం ఒక్కరోజు మహాధర్నా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ జె గాంధీ,రాష్ట్ర ట్రెజరర్ కే.రత్నకుమారి,ఎన్.సాం కిరణ్,శేషగిరి,జాన్,ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.