గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :- గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 98 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు ప్రారంభించారు. అనంతరం అనుబాబు మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్యంగా ఉన్నవారు ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేసిన వారిలో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అవసరం పడుతుందని, అలాంటి సమయాల్లో రక్తం అందించే ప్రతి ఒక్కరూ ప్రాణదాతలేనని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ, పెద్దాపురం రోటరీ క్లబ్ సిబ్బంది, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.