గూడూరు, మన న్యూస్ :- ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని..పనులు చేయకుండానే నిధులు స్వాహా చేస్తున్నారని.. దొంగ మస్టర్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు నేపథ్యంలో.నేషనల్ మస్టర్ మానిటరింగ్ సిస్టం ఆధ్వర్యంలో ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ దొంగ మస్టర్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నిర్ణయించింది..ఈ నెల 10 వ తేదీ నుంచి ఏఐ ఆధారిత ముఖ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనుంది.. ఈ క్రమంలో గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో గూడూరు క్లస్టర్ పరిధిలో ఏడు మండలాలకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ వరప్రసాద్ రావు మాట్లాడుతూ..ఏఐ ఆధారిత విధానంలో భాగంగా అప్ లోడ్ చేసిన ఫొటోలో ఎంతమంది ఉన్నారో గుర్తిస్తారు. చిత్రంలో ఉన్నవారికే మస్టర్లు వేస్తారు. జాబ్ కార్డు ఉన్న వ్యక్తి పనికి వచ్చిన వెంటనే ఆ కూలీ చిత్రాన్ని ఎన్ఎంఎంఎస్ యాప్ లో అప్లోడ్ చేస్తారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఓ పెంచలయ్య పాల్గొన్నారు.