గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మినీ గురుకులం నందు విద్యార్థినులకు "రోటరీ వెస్ట్ క్లబ్" ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్య శ్రీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ నారాయణ, చిన్నపిల్లల వైద్యం నిపుణులు డాక్టర్ త్రివిక్రమరావు, గైనకాలజీ డాక్టర్ కీర్తి నారా పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.