సీతారాంపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు ):
ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారాంపురం మండల కేంద్రమైన స్థానిక తాసిల్దార్ కార్యాలయ భవనం శిధిల వ్యవస్థలో ఉండటం అధికారులకు ప్రజలకు ఎంతగానో భయపుడుతుంది. సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ చూసినా స్లాపు పెచ్చులు పెచ్చులుగా ఊడి ఉండటం, కరెంటు వైర్లు, ఎలా బడితే అలా ఉండడం అస్థవ్యస్థంగా వేలాడుతూ ,దర్శనమిస్తాయి కిటికీలు ఊడిపోయి ఉండడం, చెదులు పట్టిన తలుపులు కిటికీలు, కళ్ళకు కట్టునట్టుగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు కార్యాలయంలోకి రావాలంటేనే బిక్కుబిక్కు,మంటూ భయంతో తమ పనుల కోసం కార్యాలయం కి తప్పక వస్తున్నారు . అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది అంటూ , ఏ సమయంలో ఏమి జరుగుతుందో అని సిబ్బంది వాపోయారు. అక్కడ విధులు నిర్వహించాలి అంటే, సిబ్బందే కాదు, అధికారులు కూడా భయంతో వణికి పోతూ కాలం, వెళ్లదీయాల్సి వస్తుంది. ఎప్పుడు ఏమి అవుతుందనే ఆందోళనతో నెట్టుకు పోవాల్సి వస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, అని భయం స్లాపు పెచ్చులు వూడి ఎవరి మీద ఎప్పుడు పడతాయో , చదలు పట్టిన కిటికీలు, సరిగ్గా లేని కరెంటు తీగలు, తాసిల్దార్ ఆవరణమంతా గడ్డి గ్రాసంతో, పనికిరాని మొక్కలు, తిధిలావస్థలకు చేరిన పాడబడ్డ భవనం. ఇది నెల్లూరు జిల్లా సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయం దుస్థితి. బయట వ్యక్తులు ఎవరైనా వస్తే..? ఇది ప్రభుత్వ కార్యాలయం..? వినియోగంలో లేని పాడు పడి శిధిలవస్థలకు చేరిన ఇల్లా..? అనేలా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్న మండల ప్రజలు.ఇప్పటికైనా అధికారులు, పాలకులు, ముందుకు వచ్చి కార్యాలయము కి మరమ్మత్తులు చేపించిచాలని మండలంలోని ప్రజలు కోరుకుంటున్నారు.