ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ మరుగుదొడ్లు పనుల నిమిత్తం గుంటలు పూడ్బే చేందుకు ఎం వి ఆర్ ప్రవేట్ కాలేజీ కి వెళ్లి దారిలో మట్టి తోలడం జరిగింది ఈ మట్టి వలన కాలేజీ బస్సు వెళ్లడానికి దారి చాలా ఇబ్బందికరంగా ఉందని పలుమార్లు కాలేజీ ప్రిన్సిపాల్ సెయింట్ మేరీస్ యాజమాన్యానికి పలుమార్లు ఫోన్ చేసి మా కాలేజీ వ్యాన్ వెళ్లడానికి ఈ మట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని పలుమార్లు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి సెయింట్ మేరీస్ యాజమాన్యంతో మాట్లాడిన నిర్లక్ష్య ధోరణితో పట్టి పట్టనట్టు వ్యవహరించిన సెయింట్ మేరీస్ యాజమాన్యం కాలేజీలకి వెళ్లే దారిలో ఉన్న మట్టి వర్షానికి తడిసిన కారణం చేత కాలేజీ నుండి విద్యార్థులను తరలిస్తున్న సమయంలో దారిలో ఉన్న మట్టి వర్షానికి తడిసి పోయి బురద ఉండడం వలన బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్ళింది ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థిని విద్యార్థులు సెయింట్ మేరీస్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా సెయింట్ మేరీస్ యాజమాన్యం దారిలో ప్రమాదకరంగా ఉన్న మట్టిని తొలగించాలని కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థులు కోరుతున్నారు.