★నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు. ★స్మార్ట్ మీటర్లు వద్దు డిజిటల్ మీటర్లే ముద్దు.
ఉరవకొండ మన న్యూస్ : నాలుగు రకాల సర్దుబాటు చార్జీలతో విద్యుత్ వినియోగదారులను విద్యుత్ శాఖ నడ్డి విరుస్తోంది. మరో రూ 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు భారం మోపడానికి రంగం సిద్ధమైంది. స్మార్ట్ మీటర్ల ముసుగులో విద్యుత్ శాఖ వినియోగదారులను నెట్టనిలువు నిట్ట నిలువునాముంచు తో o దంటూ ప్రభుత్వ చర్యలను ఎండబడుతూ సిపిఎం పార్టీ విద్యుత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నెట్యం మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ద్వారాలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలను అదనంగా మోపారని ఆరోపించారు.. ఇప్పుడు మరో 12,700 కోట్లు భారాన్ని వేయడానికి సిద్ధం చేసింది. మొత్తం నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు వసూలుకు రంగం చేసిందని మధుసూదన్ నాయుడు ఆరోపించారు. దీనితో బిల్లులు అధికంగా వస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు బిగించి అనంతరం షాపులు, చిన్న పరిశ్రమలు రెండు, మూడు రెట్లు, కొందరికి పదిరెట్లు చార్జీలు పెరిగాయి. మరో మరో 842 కోట్ల భారాన్ని మోపడానికి ఈ ఆర్ సీ అనుమతి కోరింది.
మీటర్లకు అయ్యే ఖర్చు పదివేల- 17 వేల వరకు 93 నెలల పాటు (ప్రతి నెల బిల్లులో కలిపి ) మనపై మావడం మరింత దారుణం. అధిక విద్యుత్ వినియోగించే సమయాలలో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేయడం అన్యాయం. ఫ్రీ పెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుంది. కరెంట్ బిల్లు ఆన్లైన్లో పంపడం వల్ల బిల్లులకు జవాబుదారీతనం ఉండదని ధ్వజమెత్తారు.. అందుకే ఆదరణ స్పాట్ మెటల్ విద్యుత్ వినియోగదారులకి నష్టం, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు
. ఇండ్లకు స్మార్ట్ మీటర్ బిగించడానికి ఆపాలి, పాత మీటర్లను కొనసాగిస్తూ, పాత రీడింగ్ పద్ధతిని అమలు చేయాలి, గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, షాపులకు సంస్థలకు పెట్టిన మీటర్లు తొలగించాలని, చార్జీలు పూర్తి రద్దు చేసి బిల్లులు తగ్గించాలనిసిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి పార్టీ సభ్యులు మురళి వీరాంజనేయులు రామాంజనేయులు రామాంజనేయులు నాయక్ సిద్ధప్ప సీనప్ప సూర్యనారాయణ, నాయకులు వెంకటేశులు సుంకన్న తదితరులు పాల్గొన్నారు.