చోద్యం చూస్తున్న అధికారులు.
- యథేచ్ఛగా అను'మతి' లేని అక్రమ కట్టడాలు
ఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లాలోని కనేకల్ మండల పరిధిలో బ్రహ్మసముద్రం గ్రామంలో సర్వే నంబర్235-డీ లో మిగులు భూమి ఉంది. ఈ ముగ్గులు భూమిని కొందరు కబ్జా చేసుకుని యతే చ్ఛగా అనుమతి లేని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలను నిరసిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి మొదలు రెవెన్యూ అధికారుల దృష్టికి వరస పరంపరలతో ఫిర్యాదులు చేశారు. అయితే అధికారులు మాత్రం బాధ్యతలు తమరిది కాదంటే తమరిది కాదంటూ ఒకరిపై మరొకరు బాధ్యతలు బదలాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
ప్రభుత్వ అధికారుల బాధ్యత రాహిత్యం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న వారికి చీమకుట్టినట్లైనా లేదు. వచ్చామా వెళ్ళామా అనే మూడు సూత్రాలకు మాత్రం బాధ్యతతో కట్టుబడి ఉంటున్నారు.
ప్రభుత్వ భూమి మిగులు భూమిని కంఫర్ట్ అనిపిస్తున్న కబ్జా దారుల మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారనే బలమైన విమర్శలు సంబంధిత శాఖ అధికారులపై గుప్పిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి భూ కబ్జా అక్రమ కట్టడాలపై సమగ్ర విచారణ జరిపి కబ్జా నిరోధక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.