మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా వెల్లడించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని సుమారు 10 కంపెనీలు ప్రతినిధులు హాజరవుతారు అన్నారు. యువతీ యువకులు తమ విద్యార్హత పత్రాలుతో హాజరు కావాలని ఆమె కోరారు. తర్వాత పది కంపెనీలలో వివిధ విభాగాలకు చెందిన 200 నుంచి 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు.